
ప్రజాశక్తి - వీరవాసరం
పౌష్టికాహారం తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉం డొచ్చని ఐసిడిఎస్ సిడిపిఒ టి.లక్ష్మీకాంతం అన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వీరవాసరం శెట్టిబలిజపేట అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం పోషకాహార మాసోత్సవాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ గర్భిణులకు, బాలిం తలకు, కిశోర బాలికలకు పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు.
పోడూరు : మండలంలోని పెనుమదంలో జెడ్‌పి హైస్కూలులో పాలకొల్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిపిడిఒ సిహెచ్.ఇందిర ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార ప్రదర్శనలు, పిల్లల బరువుల పర్యవేక్షణ, రక్తహీతన గర్భిణులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కిశోర బాలికలకు, బాలురకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.
మొగల్తూరు : పోషకాహారం తీసుకుంటే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఎంపిటిసి సభ్యులు ఉషారాణి అన్నారు. మండలంలోని కొండవారిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారం తీసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం గ్రామంలో అవగాహన ప్రదర్శన చేశారు. కాళ్ల :పౌష్టికాహారంతో గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హేమలత అన్నారు. మండలంలోని మాలవానితిప్ప, ఎస్‌సి బోస్ మాజీ సైనిక్ కాలనీ, కాళ్లకూరు, ఏలూరుపాడు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మహోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఆకుకూరలు, పండ్ల మొక్కలను నాటారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, పాలు పంపిణీ చేశారు.
ఉండి : ఉండి మండల వ్యాప్తంగా శుక్రవారం పోషణ మహా కార్యక్రమాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారులు మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించవచ్చని సూచించారు. అనంతరం గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ వాణి విజయరత్నం, సూపర్‌వైజర్లు వెంకట నాగలక్ష్మి, వి.నిర్మల, అంగన్‌వాడీలు గడి కుసుమ, ముదునూరి జాన్సీ, డి.సత్యవేణి పాల్గొన్నారు.