Apr 06,2023 00:55
విద్యార్థినులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న డాక్టర్‌ బాబూరావు, సుభాషిణి దంపతులు

ప్రజాశక్తి-చీరాల: పౌష్టికాహారంతో విద్యార్థులకు మంచి ఆరోగ్యం లభిస్తుందని, విద్యార్థులందరూ పౌష్టిక ఆహారం తీసుకుని బాగా చదువుకోవాలని రోటరీ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఐ బాబూరావు అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక సాయి ప్యాలెస్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ అనాథ బాలికల వసతి గృహంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. రోటరీ మరియు ఇన్నర్‌ వీల్‌ క్లబ్బుల సంయుక్త ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందజేయడం జరిగిందని విద్యార్థులందరూ 10 పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆయన కోరారు ఆయన వెంట ఇన్నర్‌వీల్‌ ప్రెసిడెంట్‌ సుభాషిణి, గుగ్గిలం లలిత కుమారి, పి నళిని, హాస్టల్‌ వార్డెన్‌ కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.