ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉంటారని గంగవరం ఎంపిటిసి మేకల రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గంగవరంలో బుధవారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. చిన్నారుల కోసం అంగనవాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని సర్పంచ్ బెల్లం సుధాకర్ తెలిపారు. చిన్నారులంతా పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. సభకు సెక్టారు సూపర్‌వైజర్ కె వాణి అధ్యక్షత వహించారు.










