Sep 17,2023 01:13

ప్రజాశక్తి - రేపల్లె
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన  కల్పిస్తున్నామని ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఆర్ వెంకటరత్నమ్మ అన్నారు. మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని పెద్ద అరవపల్లిలో ఇంటింటా పోషణ సంబరాలు - పోషణకు ఐదు సూత్రాలు వాల్‌ పోస్టర్‌ను సర్పంచ్ లోయ బాబు నాంచారయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ ఆర్ వెంకటరత్నమ్మ మాట్లాడుతూ తక్కువ బరువు ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నెలరోజుల పాటు ప్రతి ఇంటికి పోషణ, పోషకాహారం, తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి తల్లిపాల విశిష్టత తెలియజేయాలని అన్నారు. పిల్లలకు టీకాలు, పెరటి తోటల పెంపకం గురించి  వివరించారు.