Sep 06,2022 23:51

పిఎం.పాలెంలో పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్న పీడీ వెంకటేశ్వరి

ప్రజాశక్తి - ఆరిలోవ : అంతర్జాతీయ పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యాన మంగళవారం తోటగరువు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు ఎటువంటి పౌష్టికాహరం తీసుకోవాలి, వీటి ద్వారా లభించే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పౌష్టికాహరంపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు లఘు నాటికలను ప్రదర్శించారు. దీనిలో భాగంగా నిర్వహించిన పెయింటింగ్స్‌ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పిఎం పాలెం : పౌష్టికాహారం తీసుకుంటేనే గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారని శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరి అన్నారు. జీవీఎంసీ 6వ వార్డు పరిధి పిఎం పాలెం అవంతి ఫంక్షన్‌ హాల్లో చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులతో కలిసి పోషకాహార మాసోత్సవాలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిశు, మాతృ మరణాలు తగ్గించే లక్ష్యంగా పాలు, పండ్లు, గుడ్డు వంటి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. తల్లీబిడ్డలకు పౌష్టికాహారాన్ని అందించి వాటి విలువలను తెలపాలని ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ నీలవేణి, సరిత, సుబ్రమణ్యం, బొట్ట అప్పలరాజు, ఇఎన్‌ఎస్‌ చంద్రరావు, పోతిన ఎల్లాజీ, కనకరాజు సియ్యద్రి, గుంటుబోయిన సంజీవ్‌, వరలక్ష్మి పాల్గొన్నారు.