Nov 05,2022 21:10

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అమలు కాని మెను
ఆవేదనలో విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రజాశక్తి - చింతలపూడి

            చింతలపూడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. దీంతో భోజనం సరిగా చేయక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. అన్నం చిమిడి పోయి, ముద్దగా ఉండటంతో తినేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సరైన కూరలు కూడా లేకపోవడంతో ఒక్కో సందర్భంలో భోజనం కూడా చేయడం లేదని పలువురు విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెను ఇక్కడ అమలు కావడం లేదు. గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు 2018లో ప్రత్యేక మెనూను ప్రభుత్వం రూపొందించింది. దీని ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ప్రకటించింది. కాని ఈ మెను ఎక్కడా కూడా అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో 135 మంది విద్యార్థులున్నారు. సరైన భోజనం అదించటంలేదని విద్యార్థుల తల్లితండ్రులు గగ్గోలు పెడుతున్నారు. భోజనం తినలేక వసతి గృహంలో ఉన్న మురికి కాలువలో పడేసి విద్యార్థులు ఆకలితోనే ఉంటున్నారు. విద్యార్థులు నిద్రించే గదులు కూడా విద్యార్థులే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తరగతి గదులు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఉన్నతాధి కా రులు స్ప ందించి వి ద్యారు లకు నా ణ్యమైన భో జనం అందించాలని కోరుతున్నారు.
వసతిగృహంలో మెను సక్రమంగా అమలు కావడంలేదు. మెను ప్రకారం ఆదివారం ఉ దయం అల్పా హరంగా పూరి, బంగాళాదుంప, బఠాని కుర్మా, స్నాక్స్‌ వే రుశనగ ఉండ, మధ్యాహ్నం తా లింపు అన్నం, చికెన్‌ కర్రి, గోంగుర చట్ని, పెరుగు, సాయంత్రం బెల్లంతో రాగిజావ, రాత్రికి అన్నం, వంకాయకూర, పాలకూర పప్పు, మజ్జిగా పడుకున ేముం దు అరటి పండు ఇవ్వాలి. సోమవారం ఉ దయం పాలు, పెసరపప్పు కూ రగాయలతో కిచిడి, పినట్‌ చట్ని, మధ్యాహ్నం అన్నం, బంగాళదుంపఇగురు, సాంబారు పెరుగు, సాయంత్రం బెల్లంతో రాగిజావా, రాత్రి అన్నం, దోసకాయ కూర, తోటకూర పప్పు, మజ్జిగ, పడుకునే ముందు అరటిపండు, మంగళవారం ఉదయం పాలు, చింతపండు పులిహోర, ఉడికించిన గుడ్డు, వేరుశనగా ఉండ, మధ్యాహ్నం అన్నం దొండకాయ ఇగురు, సాంబారు, పెరుగు, సాయంత్రం బెల్లంతో రాగిజావా, రాత్రికి తాల్లింపు అన్నం, సొరకాయ గోంగుర చట్ని, మజ్జిగ, పడుకునేముందు అరటిపండు, బుధవారం పాలు, ఇడ్లీ, పినట్‌ చట్ని, ఉడికించిన గుడ్డు, వేరుశనగా ఉండ, మధ్యాహ్నం అన్నం, బెండకాయ ఇగురు, సాంబారు, పెరుగు, సాయంత్రం బెల్లంతో రాగిజావ, రాత్రికి అన్నం, బంగాళదుంప కూర, గోంగుర పప్పు, మజ్జగ, పడుకున ేముందు అరటిపండు, గురువారం పాలు, గోధుమ రవ్వ ఉప్మా, పినట్‌ చట్ని, ఉడికించిన గుడ్డు, వేరుశనగ ఉండ, సాయంత్రరం బెల్లంతో రాగిజావ, రాత్రికి అన్నం, చికెన్‌కర్రి, తోటకూర పప్పు, మజ్జిగ, అరటిపండు ఇవ్వాలి. శుక్రవారం పాలు, పెసరపప్పు పొంగల్‌, పినట్‌ చట్ని, ఉడికించిన గుడ్డు, వేరుశనగ ఉండ, సాయంత్రం బెల్లంతో రాగిజావ, రాత్రి భోజనంలో తాలింపు అన్నం, బంగాళదుంప బఠాని, కుర్మా, గోంగుర చట్ని మజ్జిగ, పడుకునే ముందు అరటిపండు, శనివారం ఉదయం పాలు, ఇడ్లి, పీనట్‌ చట్ని, ఉడికించిన గుడ్డు, స్నాక్స్‌, వేరుశనగ ఉండ, మధ్యాహ్నం అన్నం, క్యాబేజీ ఇగురు, సాంబారు, పెరుగు, సాయంత్రం బెల్లంతో రాగిజావ, రాత్రికి అన్నం, కాయకూర, గోంగుర పప్పు, మజ్జిగ, పడుకునేముందు అరటిపండు ఇవ్వాలి. మెను కోసం మూడు నుంచి నాలుగో తరగతి విద్యార్థులు ఒక్కోక్కరికి నెలకు రూ.వెయ్యి, ఐదు నుంచి పదో తరగతి విద్యార్థులు ఒక్కోక్కరికి రూ.1,250, ఇంటర్‌ ఆపైన విద్యార్థులు ఒక్కోక్కరికి రూ.1,400 ప్రభుత్వం కేటాయించింది.
నాణ్యమైన భోజనం అందిస్తాం
చాగంటి సోమసుందర్‌, ప్రధానోపాధ్యాయులు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.