ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని పావులూరు ఐసిడిఎస్ సెక్టారు సూపర్‌వైజర్ కె వాణి సూచించారు. పౌష్టికాహారోత్సవాల్లో భాగంగా మండలంలోని భీమవరంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చిన్నారులకు తినిపించాల్సిన ఆహారం గురించి తల్లులకు వివరించారు. కార్యక్రమంలో జిఎంఎస్‌కె నాగకుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు పి చెంచులక్ష్మి, డి ఎస్తేరురాణి పాల్గొన్నారు.










