Sep 19,2023 21:40

పౌష్టికాహారం తల్లి బిడ్డకు శ్రేయస్కరం:సిడిపిఓ


పౌష్టికాహారం

తల్లి బిడ్డకు శ్రేయస్కరం:సిడిపిఓ
ప్రజాశక్తి - బాలాయపల్లి : పౌష్టికాహారం తల్లి బిడ్డకు శ్రేయష్కరమని సిడిపిఓ సంషాద్‌ బేగం పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అంబలపూడిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పంపిణీని తనిఖీ చేశారు. స్త్రీ సంక్షేమ శాఖ సూపరువైజర్‌ రాజేశ్వరి ఆధ్వర్యంలో తల్లిపాలు వారోత్సవాలులో భాగంగా బాలింతలకు, గర్భవతులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆ పాలల్లో పోష్టికాహారం సమకూరి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతారు అన్నారు. ప్రతి తల్లి శిశువు జన్మించినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలన్నారు. తల్లి పాలు విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపరువైజర్‌ రాజేశ్వరి, అంగన్‌వాడీ కార్యకర్త వెంకటమ్మ, అయా భారతి పాల్గొన్నారు.