Aug 15,2023 22:59

రోగులను పరీక్షిస్తున్న వైద్యాధికారి రవికాంత్‌

ప్రజాశక్తి- ఆమదాలవలస: ప్రతిఒక్కరూ సరియైన సమయంలో సరైన నియమాలు పాటించడం, పౌష్ఠికాహారం తీసుకుంటే గుండె జబ్బులను నివారించవచ్చునని గుండె వ్యాధి నిపుణులు, అపోలో ఆస్పత్రి డాక్టర్‌ తెలికిచెర్ల రవికాంత్‌ అన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణంలోని పూజారిపేట రోడ్డులో ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ కళ్యాణ మండపంలో సత్యసాయి సేవా సంస్థల జోనల్‌ కన్వీనర్‌ ఎం.జనార్థనరావు ఆధ్వర్యాన మంగళవారం ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా మెడికల్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ పి.తాతయ్య లు పర్యవేక్షణలో 60 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇసిజితో పాటు 2-డి ఎకో, రక్త పరీక్షలు చేపట్టి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ పి.సుభాష్‌చంద్ర, సాయి సంస్థల జిల్లా జాయింట్‌ యూత్‌ కో-ఆర్డినేటర్‌ సాయికృష్ణ. బి.జోనల్‌ యూత్‌ ఇన్‌ఛార్జి పవన్‌, సమితి కన్వీనర్‌ కెకానావదానులు పాల్గొన్నారు.