Sep 14,2023 19:41

మాట్లాడుతున్న ఐసిడిఎస్‌ విజయలక్ష్మీ

మాట్లాడుతున్న ఐసిడిఎస్‌ విజయలక్ష్మీ
పౌష్టికాహార వారోత్సవాలు
ప్రజాశక్తి-కావలి రూరల్‌:కావలి మండల పరిధిలోని తాళ్లపాలెం సచివాలయంలో గురువారం పౌష్టిక ఆహార వారోత్సవాల సందర్భంగా తల్లి పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడి ఎస్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక పోషకాలు గల పౌష్టిక ఆహార పదార్థాలను గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా తీసుకుంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు అంగన్వాడి కార్యకర్తలు ఆ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎఎన్‌ఎం కామేశ్వరి, అంగన్వాడి టీచర్లు అరుణ, జ్యోతి ,శశికళ ,ఉష, తదితరులు పాల్గొన్నారు.