మాట్లాడుతున్న అంగన్‌వాడీలు
మాట్లాడుతున్న అంగన్‌వాడీలు
పౌష్టికాహార వారోత్సవాలు
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి అంగన్ వాడీ కేంద్రంలో శనివారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సచివాలయ మహిళా పోలీస్ వనజ, ఎం.ఎల్. హెచ్.పి అలేఖ్య సంయుక్త గా మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా ప్రతినెలా హెల్త్ చెకప్ లు చేయించుకోవాలన్నారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పి.భాగ్యలక్ష్మి, జె.గురు వర్ధని, సి హెచ్.జ్యోతి, ఎస్. జీవమ్మలు పాల్గొన్నారు.










