మాట్లాడుతున్న సూపర్‌వైజర్
పౌష్టికాహార మాసోత్సవాలు ప్రారంభం
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని వెంకటేశ్వరపురం సెక్టార్ లోని అంగన్వాడి సెంటర్ జనార్దన్ రెడ్డి కాలనీ -4 సెంటర్ నందు పౌష్టికాహార మాసోత్సవాలను ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ రాజ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందజేసే వైయస్సార్ సంపూర్ణ బాలామతంలో ఎక్కువ మోతాదులో పోషకాలు ఉన్నాయని, వీటిని బాలింతలు గర్భిణీలు తప్పక తీసుకోవాలని వారు కోరారు. క్రమం తప్పకుండా గర్భిణీలు వైద్య పరీక్షలను చేయించుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దేశ్ కుమార్ అంగన్వాడీ టీచర్లు అరుణ, మాధవి లత, మాధవి, శైలజ, మల్లమ్మ స్పందన ఫాతిమా శాంతి ఎం ఎస్ కే లు అమన్ సురేఖ హిమజ శ్రావణి మరియు ఏఎన్‌ఎమ్ లు ఆశాలు తదితరులు పాల్గొన్నారు










