తెనాలిరూరల్: మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శకపురుషుని శతజయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక పెమ్మసాని థియేటర్లో గురువారం ఎన్టీఆర్ నటించిన డాక్టర్ ఆనంద్ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించారు. రోజుకొక కళాకారులను సత్కరించే కార్యక్రమంలో ప్రముఖ పౌరాణిక నాటక కళాకారుడు కంచర్ల బాబురావు ను కఠెవరం టీడీపీ నాయకులు కంచర్ల ఏడుకొండలు, నాగభూషణం, చంద్రశేఖర్, విజయ భాస్కర్, గౌరిశంకర్, వర్మ, పద్మారావు, మధుకిరణ్ తదితరులు ఎన్టీర్ జ్ఞాపికను అందజేసి సత్క రించారు. థియేటర్ కమిటీ సభ్యులు పెమ్మసాని పోతురాజు, ఈదర వెంకటపూర్ణచంద్,డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జగన్, ఎం.రాఘవరావు, కాకుమాను రాంబాబు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.










