Sep 26,2023 21:01

విజయనగరం: బైక్‌ ర్యాలీ చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- బొబ్బిలి : పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబును వైసిపి ప్రభుత్వం అరెస్టు చేసిందని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బొబ్బిలిలో 14వరోజు దీక్షలు మంగళవారం కొనసాగాయి. దీక్షా శిబిరంలో బేబినాయన, తెంటు రాజా కూర్చుని నిరసన తెలిపారు. దీక్షలకు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, నియోజకవర్గ ఇంచార్జి జి.అప్పలస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ మద్దతు ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శృంగవరపు కోట: పట్టణంలోని దారగంగమ్మ ఫంక్షన్‌ హాల్‌ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వర్గం ఆకుల డిపో వద్ద గొంప కృష్ణ వర్గాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 14వ రోజు కొనసాగాయి. గొంప కృష్ణ నిర్వహిస్తున్న శిబిరం వద్ద చంద్రబాబును విడుదల చేయాలంటూ అర్ధ నగంగా ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దీక్షలో నియోజకవర్గంలోని 250 మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు సంతకాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి జనసేన జిల్లా ప్రచార కమిటీ సభ్యులు పెదిరెడ్ల రాజశేఖర్‌, జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.
భారీగా బైక్‌ ర్యాలీ
విజయనగరం కోట: టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు మంగళవారం ఉదయం రామతీర్థం దేవస్థానం నుంచి బైక్‌ ర్యాలీ చేపట్టారు. నెల్లిమర్లలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి, అక్కడి నుండి విజయనగరం పట్టణంలో పూల్‌బాగ్‌ కోలనీ రోడ్డు, అంబటిసత్రం, మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి కోవెల, రైల్వే స్టేషన్‌ రహదారి మీదుగా పార్టీ కార్యాలయం అశోక్‌ బంగ్లాకు బైక్‌ ర్యాలీ చేరుకుంది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు లక్ష్మీ వరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణ
మేము సైతం బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా మంగళవారం తోట పాలెంలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజ్‌, ఎంఎస్‌ఎన్‌ డిగ్రీ కాలేజీలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత విద్యార్థులతో సంతకాల సేకరణ, పోస్ట్‌ కార్డులు పై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి టి. రమణ, మాడిమి దేవేంద్రనాథ్‌, కెల్ల సూరిబాబు, మాడుగుల భాను ప్రకాష్‌, చిప్పాడ మణికంఠ స్వామి, అంబల్ల సూర్య ప్రకాష్‌, మీసాల సూరిబాబు, గోగుల రమేష్‌, చందక రాజు, చందక సూరప్పుడు, రవి, గౌరీ తదితరులు పాల్గొన్నారు.
గరివిడి: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా చీపురుపల్లిలో మంగళవారం వెదుళ్ళవలస గ్రామ టిడిపి నాయకులు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షలను చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్‌ కిమిడి నాగార్జున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెదుళ్ళవలస టిడిపి నాయకులు మన్నెపురి సూర్యనారాయణ, శ్రీదేవి, నెమ్మది విశ్వనాధం, నెమ్మది రామారావు, కిరాల గౌరీనాయుడు, నెమ్మది శివ, కిరాల సూర్యనారాయణతో పాటు మండల నాయకులు పైల బలరాం, సారేపాక సురేష్‌ బాబు, జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు, విషినిగిరి శ్రీనివాసరావు, సాసుబిల్లి రాము నాయుడు, పాల్గొన్నారు.