
ప్రజాశక్తి-ఉప్పలగుప్తం
గొల్లవిల్లి పంచాయతీ ఇందిరానగర్ లో తాగునీటి పైపు లైన్ నిర్మాణానికి శుక్రవారం సర్పంచ్ జొన్నాడ శ్రీదుర్గ శంకుస్థాపన చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్ సమకూర్చిన జిజిఎంపి నిధులు రూ.5 లక్షల వ్యయంతో 615 మీటర్ల పొడవు మేర ఈ పైప్ లైన్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీదుర్గ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొంగ కనకదుర్గ, పంచాయతీ వార్డు సభ్యులు జినిపే మహాలక్ష్మి, చప్పిడి శ్రీనివాసరావు, ఎఎంసి డైరెక్టర్ చప్పిడి దుర్గారావు, వైసిపి యువజన విభాగం మండల అధ్యక్షుడు ఓగూరి విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.