Aug 21,2023 20:25

మరమ్మతులు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -పొదలకూరు : పొదలకూరు గ్రామ పంచాయతి పరిధిలోని ఎంఆర్‌ఒ కాలనీ మంచి నీటిని అందించే పైప్‌ లైన్‌ చెరువు వద్ద మరమ్మతులకు గురైంఇ. వర్షాలు వల్ల చెరువు నిండా నీరు ఉండడంతో మరమ్మతులకు ఆటంకంగా ఉంది. దీంతో ప్రస్తుతం చెరువులో నీరు తగ్గడంతో కాలనీ వాసులకు నీటి సరఫరా ఇబ్బంది కలుగకుండా జెసి సహాయంతో ఉప సర్పంచ్‌ వాకాటి శ్రీనివాసులు రెడ్డి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. పంచాయతీ సెక్రటరీ అల్లాబక్షు వైసిపి నాయకులు గంగవరపు వేణు గోపాల్‌ రెడ్డి ఉన్నారు.