పైళ్ల సుభాషిణి రెడ్డికి డాక్టరేట్
ప్రజాశక్తి - క్యాంపస్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యావిభాగం పరిశోధన విద్యార్థిని పైళ్ల సుభాషిని రెడ్డికి విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. విశ్వవిద్యాలయ విద్యావిభాగం ఆచార్యులు టంగుటూరి శిరీష మార్గదర్శకత్వంలో 'సబ్జెక్టు ఓరియంటెడ్ ప్రాక్టీసెస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ రిలేషన్ టు అచీవ్మెంట్ ఎమాంగ్ ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్' అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. ఇందుకుగాను ఆమెకి డాక్టరేట్ అవార్డును ప్రధానం చేసినట్లు వర్సిటీ డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ జీవన జ్యోతి తెలిపారు. ఈమె పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జనరల్స్‌లో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించినట్లు వివరించారు. సుభాషిణికి డాక్టరేట్ అవార్డు రావడం రావడంం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.










