Oct 08,2023 21:12

సిరిమాను చెట్టుకు పూజలు చేస్తున్న పూజారి, సిబ్బంది

ప్రజాశక్తి-నెల్లిమర్ల : పైడితల్లమ్మ సినిమానోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యంత కీలకమైన సినిమాను ఘట్టానికి అవసరమయ్యే చెట్టును జరజాపుపేట వద్ద గుర్తించారు. ఈ చెట్టుకు ఆలయ అధికారులు, పూజారులు, స్థానిక పెద్దలు ఆదివారం పూజలు నిర్వహించారు. తుమ్ము అప్పారావు కుటుంబానికి చెందిన కళ్లంలో ఈ చెట్టును గుర్తించారు. ఈ నెల 15న విజయనగరం తరలిస్తామని పైడితల్లమ్మ ఆలయ ఇఒ సుధారాణి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామారావు, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.