ప్రజాశక్తి-విఆర్.పురం
ఎర్ర జెండా చేతబట్టి, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, గిరిజన, మహిళల సమస్యలపై పోరాటాలు నడిపిన అమరజీవి కీర్తిశేషులు పాయం సీతమ్మ 13వ వర్థంతి కార్యక్రమం గురువారం కూనవరం మండలం పెద్దార్కూరులో ఘనంగా నిర్వహించారు. సీతమ్మ స్థూపానానికి, ఆమె చిత్ర పటానికి సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పేన్ కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ముర్లపాటి నాగేశ్వరరావు, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీతమ్మ నాడు ఎర్రజెండా నీడన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. స్త్రీల సమస్యలపై అనేక పోరాటారని గుర్తు చేశారు. ఆమె పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, మాజీ జెడ్పిటిసి రంగమ్మ నాయకులు పాయం సత్యనారాయణ, తాలూరి శ్రీనివాసరావు, తెలగాని నాగరాజు, నోముల సత్యనారాయణ, ఎంపీటీసీ అమ్మాజీ, సర్పంచులు నాగమణి, వెంకమ్మ, శంకర్, రామారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










