Mar 14,2023 00:44
పావులూరులో వైద్య పరీక్షలు చేస్తున్న కిమ్స్‌ వైద్యులు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: వైద్య రంగంలో ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కిమ్స్‌ హాస్పిటల్‌, ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఇంకొల్లు మండలం పావులూరు గ్రామ పెద్దల సహకారంతో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటికి సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించి గుండె, కిడ్నీ, విష జ్వరాలు లాంటి వ్యాధులకు వైద్యులు, పేషంట్లకు తగు జాగ్రత్తలు చెప్పారు. రోగ నిర్ధారణ జరిగిన 30 మంది పేషంట్లకు ఒంగోలు కిమ్స్‌ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ, ఈహెచ్‌ఎస్‌, కార్డుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తా మని ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తామని కిమ్స్‌ హాస్పిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ షేక్‌ రఫీ తెలిపారు. క్యాంపు లో డాక్టర్‌ రామాంజనేయులు, ఆప్తమాలజిస్ట్‌ రాణి, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 200 మందికి వైద్య పరీక్షలు చేశారు.