Aug 26,2023 23:45

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
మండలంలోని పావులూరు పంచాయతి నూతన సర్పంచ్చ్‌గా బొల్లెద్దు లుదియమ్మ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 19న జరిగిన సర్పంచ్ ఉప ఎన్నికలలో ఆమె వైసిపి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పావులూరు  పంచాయతీ వద్ద ఎన్నికల రిటర్నింగ్ అధికారి భానుప్రసాద్‌ ఆమెచే ప్రమాణ స్వీకారం చేయించారు. బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ లుదియమ్మ మాట్లాడుతూ ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వైసిపికి, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.