పోరుమామిళ్ల టౌన్ : జూనియర్ కళాశాలలు తెరచి నెల రోజులు గడుస్తున్న ఇంతవరకూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వక పోవడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు. గురు వారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తహశీల్దార్ కార్యా లయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పేదలు కావడంతో పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. దీనిని ప్రభుత్వం దష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఉచి తంగా పాఠ్యపుస్తకాలను అందించాలన్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. అనంతరం ఆర్‌ఐ సుధాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాహుల్, మండల నాయకులు సుమంత్, సందీప్, ప్రవీణ్, చందు, విద్యార్థులు పాల్గొన్నారు.










