కడప అర్బన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటు అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి మనోహర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయక్, సగిలి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట 8గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బ ందులకు గురిచేస్తుందన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులు ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇంటర్మీడియట్ విద్యార్థుల స మస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు వెంకట సుబ్బయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్, వినరు, వీరపోగు రవి, సుమంత్, సందీప్, కలివెల రాజశేఖర్, రమేష్, ప్రసంగి, అరవింద్, సురేష్ నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.










