Sep 14,2022 22:30

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డిఇఒ చంద్రకళ

ప్రజాశక్తి - ఆరిలోవ : జోడుగుళ్ళపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ బుధవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పఠనా సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థులచే చిన్న, చిన్న పదాలను ఎక్కువ సార్లు పలికించేటట్టు చూడాలని, తప్పులు దొర్లినప్పుడు గుర్తించి వెంటనే సరిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాడు నేడు ఫేజ్‌ -2 పనులను వెంటనే ప్రారంభించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాల మరమ్మత్తు పనులు జరిగే గదుల్లో విద్యార్థులను ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె పిల్లలతో కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.