Sep 25,2023 22:02

పాఠశాల భవనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి - చిలమత్తూరు : మండల పరిధిలోని నల్లరాళ్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలను అధికారులు సోమవారం పరిశీలించారు. 'నీటికుంటలా పాఠశాల ప్రాంగణం' అనే శీర్షికన సోమవారం ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఇన్‌ఛార్జి ఎంపిడిఒ రాంకుమార్‌ స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత కోడూరు కార్యదర్శి నారాయణ స్వామిని ఆదేశించారు. దీంతో కార్యదర్శి నారాయణ స్వామి సోమవారం పాఠశాలను సందర్శించారు. నీటి తొలగింపునకు వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాతభవనం కూల్చివేతకు తగిన చర్యలు తీసుకోవడానికి భవనాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ఇంజనీర్‌ జమల్‌ బాషాకు సూచించామన్నారు. సమ్సయను మూడురోజుల్లో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంఇఒ తెలిపారన్నారు.