Mar 09,2023 23:46

తనిఖీ చేస్తున్న ఉప విద్యాశాఖాధికారి

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:మండలంలోని దార్లపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా ఉప విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్‌ ఆవరణ, తరగతి గదులను పరిశీలించిన ఆయన పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబు వినియోగంపై అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌, గ్రంధాలయం వినియోగం పై పలు సూచనలు చేశారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి మూర్తి ఉన్నారు.