Jul 01,2023 22:12

ఫొటో : విద్యార్థినిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

పాఠశాలలో విద్యార్థికి సన్మానం
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం పాత బిట్రగుంట ఉన్న జెడ్‌పి పాఠశాలలో చిన్న వయసులోనే గణితంలో అద్వితీయ ప్రతిభా పాటవాలును ప్రదర్శిస్తూ గతేడాది ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన చిత్తూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మిని శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనకారావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితంలో వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, పైతాగొరియన్‌ త్రిప్లెట్స్‌, స్పీడ్‌ మ్యాథ్స్‌ గురించి విద్యార్థుల ముందు అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వారితల్లి చిర్రా సత్యాదేవి గణితంలో స్పీడ్‌ మ్యాథ్స్‌లో మెళకువలు విద్యార్థులకు నేర్పించారు.
కావలికి చెందిన సువర్ణిక అనే చిన్నారి డీ కోడింగ్‌పై ప్రదర్శన ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్య కమిటీ ఛైర్మన్‌ రావి శ్రీనయ్య, స్థానిక ఉపాధ్యాయులు మద్దులూరి ప్రసాద్‌ పాల్గొన్నారు.