
ప్రజాశక్తి - తణుకు రూరల్
సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూలులో ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అమ్మ ప్రేమకు మారు పేరు, నాన్న నిండైన బాధ్యతకు మరో రూపం అని తోడు నీడగా ఉండేది తల్లిదండ్రులేనని చెప్పారు. ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఎండి సాహిదా బేగం మాట్లాడుతూ తల్లిదండ్రులను ప్రతి నిత్యం గుర్తుంచుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా త్యాగమూర్తులు తల్లిదండ్రులు అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అంతదించారు. అనంతరం ఎండి సాహిదా బేగంను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ప్రమీళ, ఎస్‌కె.రహిమా, ఎండి అలంగీర్ భాష, ఎం.మోహన్‌రావు, ఎంఎన్.ఫణి, రాపర్తి పాపారావు, జి.సువర్చల, డి.విజయశేఖర్, జయశ్రీ, సాయిలక్ష్మి పాల్గొన్నారు.