
ప్రజాశక్తి - కాళ్ల
ప్రాథమిక పాఠ శాలలో దాత సహకారంతో సరస్వతిదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రధానో పాధ్యాయులు బెల్లంకొండ మురళినాగశ్రీనివాసరావు అన్నారు. వేంపాడు హిందూ ప్రాథమిక పాఠశాలలో సరస్వతిదేవి విగ్రహాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలు వేశారు. విద్యార్థులకు సరస్వతి దేవి భక్తి గీతాలు ఆలపించారు. శ్రీ అభిరుచి రెస్టారెంట్ అధినేత వేగేశ్న రామకృష్ణంరాజు సుమారు రూ.54 వేలతో సరస్వతి దేవి విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళ్ల ఎంఇఒ-1 ఎ.రవీంద్ర, ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు, దాత వేగేశ్న వంశీరాజు, ఉప సర్పంచి వేగేశ్న సుమన్, వేగేశ్న పుల్లంరాజు, కోసూరి సత్యనారాయణరాజు, వేగేశ్న సత్యనారాయణరాజు, దాత వేగేశ్న జానకిరామరాజు, ఉపాధ్యాయులు కిషోర్, వరలక్ష్మి, స్వామి, రవికుమార్‌రాజు, రామకృష్ణంరాజు, సత్యనారాయణ, అశోక్ పాల్గొన్నారు.