ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డికి అర్జీ ఇస్తున్న హెచ్.ఎం, ఉపాద్యాయులు
ప్రజాశక్తి - లింగసముద్రం :లింగసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమ్మడిశెట్టి మాధవరావు, ఉపాద్యాయులు ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డిని కోరారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యలయంలో ఆయను కలిసిన వారు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని, డైనింగ్ హాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, విద్యార్థులు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్వో ప్లాంట్ మంజూరుకు, మిగిలిపోయిన ప్రహరి గోడ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు.










