ప్రజాశక్తి-వేటపాలెం: మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కొణిజేటి చేనేతపురి చల్లారెడ్డిపాలెం పంచాయతీలో జగనన్న విద్యా కానుక, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో శుక్రవారం వేటపాలెం జడ్పిటిసి బండ్ల తిరుమలాదేవి పాల్గొన్నారు. కొణిజేటి చేనేతపురి మండల పరిషత్ పాఠశాలలో జగనన్న విద్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ నూతనంగా చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రమోషన్ మీద బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు డేటా ప్రేమసాగర్, జె అరుణ, అన్నపూర్ణలను ఘనంగా సన్మానించారు. నూతనంగా పాఠశాలకు ఉపాధ్యాయులుగా వచ్చిన ఖాదర్ మున్నీసా, ఎం అరుణ, ఎం శ్రీనివాసరావు, జ్యోతి, కరుణశ్రీ కూడా స్కూల్ కమిటీ చైర్మన్ తారక రామారావు విద్యార్థుల తల్లిదండ్రులు అత్యంత ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమం బుర్ల సాంబశివరావు మాస్టారు ఆధ్వర్యంలో నిర్వహించారు.










