Apr 12,2023 17:31

మోడల్‌ స్కూల్‌లో రికార్డులను తనిఖీ చేస్తున్న రాష్ట్ర అబ్జర్వర్‌

పాఠశాలలో ప్రతి విషయం జాగ్రత్త
- రాష్ట్ర అబ్జర్వర్‌ శ్రీనివాసరావు
ప్రజాశక్తి - పగిడ్యాల

      పాఠశాలల్లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర అబ్జర్వర్‌ శ్రీనివాసరావు ఎంఇఒ సుభాన్‌, ఎపిఎం శ్రీనివాసులు, ఎఇ వెంకటేశ్వర్లకు సూచించారు. బుధవారం పగిడ్యాలలోని మోడల్‌ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలలో జగన్న విద్య కానుక కింద మంజూరైన బ్యాగులు, పుస్తకాలను, ఇతర స్టాక్‌ పాయింట్‌ను తనిఖీ చేశామన్నారు. అనంతరం పాఠశాల గదులను, రికార్డులను పరిశీలించారు. ఎఎంఒ లలిత, ఎఎఎంఒ యూనుస్‌భాష తదితరులు పాల్గొన్నారు.