Dec 15,2022 00:11

నాడు-నేడు పనులకు భూమి పూజలో పాల్గొన్న సర్పంచ్‌, ఎంపిటిసి తదితరులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం
మండలంలోని పెద్దమట్టపల్లి పంచాయతీ పరిధి బూర్గువాడ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు నిధులు రూ.12 లక్షలతో చేపట్టనున్న పనులకు స్థానిక సర్పంచ్‌ వెట్టి లక్ష్మి, ఎంపిటిసి పూనెం ప్రదీప్‌కుమార్‌ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నిధుల్లో రూ.4లక్షలతో వంట షెడ్‌ నిర్మాణం, మిగిలిన నిధులతో మరమ్మతు పనులు చేపట్టన్నట్లు తెలిపారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న బాత్‌ రూమ్‌లను, పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుబ్బలక్ష్మి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ జల్లి ఉదరు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సొడే నాగేశ్వరావు, స్కూల్‌ విద్య కమిటీ చైర్మన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.