విద్యార్థులతో కలసి భోజనం చేస్తున్న అబ్దుల్ సత్తార్
చీరాల : మండల పరిధిలోని దేవినూతల పాఠశాలను జిల్లా జాయింట్ డైరెక్టర్ అబ్దుల్ సత్తార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులు, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతోకొద్దిసేపు మాట్లాడారు. పాఠశాలలోని సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులువ తదితరులు పాల్గొన్నారు.










