
ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న ఎంఇఒ ధనలకీë
పాఠశాలలో ఎంఇఒ తనిఖీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పెగళ్లపాడు ఎస్‌సి ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎంఇఒ-2 ధనలక్ష్మి వార్షిక తనిఖీ నిర్వహించారు. అనంతరం పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు, నాడు-నేడు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెలలో ఐదు పాఠశాలల్లో వార్షిక తనిఖీ నిర్వహిస్తున్నామని, ఈ తనిఖీలలో పాఠశాలలకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఉపాధ్యాయులకు తగు సూచనలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌జి రాజేంద్ర కుమార్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సహోపాధ్యాయురాలు సంపూర్ణమ్మ, సిఎంఆర్‌టి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.