ప్రజాశక్తి-సబ్బవరం
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు జరుగుతున్న 'కషి' 50 రోజుల ప్రణాళిక గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కృషి టైం టేబుల్ గురించి తెలియదన్న ఉపాధ్యాయులు పివి.భాస్కరరావుకు, తెలియజేయనందుకు ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్.చిన్నమ్మాయికి షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల నోట్ బుక్స్‌ను పరిశీలించారు. 8వ తరగతి విద్యార్థులకు అందజేసిన బైజూస్ టాబ్‌లను విద్యార్థులు ఉపయోగిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థుల వర్క్ బుక్స్‌ను పరిశీలించారు. విద్యార్థులచే పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిఇఒ వెంట సిసి వై.వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి ఎస్.అప్పలరాజు ఉన్నారు.










