Jul 07,2023 23:45

ఎన్సిఆర్‌ఎం స్కూల్లో విద్యార్థులతో ఎంఇఒ జయంతిబాబు

తెనాలి: పట్టణంలోని బాలాజీరావుపేట మున్సిపల్‌ ఎలి మెంటరీ పాఠశాల, దివ్యాంగబాలల పాఠశాల భవిత కేం ద్రాన్ని ఎంఇఒ-1 డాక్టర్‌ ఎం.లక్ష్మీనారాయణ శుక్రవారం పరిశీలించారు. జగనన్న విద్యా కానుక ద్వారా అందించిన బ్యాగ్‌, యూనిఫామ్‌, షూస్‌, సాక్స్‌, బెల్ట్‌ తో కూడిన కిట్‌ ను విద్యార్థులందరికీ అందిందా లేదా తెలుసుకున్నారు. యూనిఫామ్‌ లో అటెండ్‌ కాని విద్యార్థుల తల్లిదండ్రులకు త్వరగా వారి పిల్లలతో యూనిఫామ్‌ ధరింపచేసి స్కూల్‌ కి పంపేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై తరగతి ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని అన్నారు. జెవికె కిట్టు అందని విద్యార్థులు వివరాలపై ఆరా తీశారు. స్థానిక మారీస్‌పేట లోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను ఎంఇఒ- 2 వి. జయంతి బాబు సందర్శించారు. విద్యార్థుల హాజరు, జగనన్న గోరుముద్ద పథకం అమలు తీరుపై ఆరా తీశారు. ఇంకా ఇంటి నుండి భోజనంతెస్తున్న విద్యార్థుల తల్లులతో ఆయన మాట్లాడారు. పేరెంట్‌ కమిటీ సభ్యులు, విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలలోనే జగనన్న గోరుముద్ద తీసుకోవాలని సూచించారు. గత రెండేళ్లుగా కొనసాగుతున్న డ్రాపౌట్స్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు అభివృద్ధి పనులు జులై నెలాఖరుకు పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాల దృష్ట్యా మున్సిపల్‌ ఆఫీస్‌లో ఎఈ నాగమల్లేశ్వరరావుతో కలసి, ఎఇ లకు, సచివాలయం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీరితోపాటుగా ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ జి ప్రశాంతి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అరుణ్‌ కుమార్‌, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ శ్యాంబాబు శ్రీదేవి ఉన్నారు.