
ప్రజాశక్తి - కడియం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ మండలంలోని పలు పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం తనిఖీలు చేశారు. కడియం ప్రాథమిక పాఠశాల -2లో మధ్యాహ్న భోజన రికార్డులు పరిశీలించి, భోజనాన్ని రుచిచూచి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కడియం జడ్‌పి హైస్కూల్లో విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. హైస్కూల్ నందు 850 మంది విద్యార్థులుండగా, 469 మంది విద్యార్థులు మాత్రమే భోజనం చేయడంపై హెచ్‌ఎంను ప్రశ్నించారు. భోజనం చేసే విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారని ఎంఇఒ లజపతిరారు తెలిపారు. ఈ పర్యటనలో ఎండిఎం ఎడి వి.వెంకట్రాజు, సూపరింటెండెంట్ టి.శ్రీనివాస్, ఎంఎస్‌ఒ ప్రభాకరరావు, సిడిపిఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు.