పాఠశాలలలో 'నా భూమి - నా దేశం'
పాఠశాలలలో 'నా భూమి - నా దేశం'
ప్రజాశక్తి -పెళ్లకూరు:పెళ్లకూరు మండలం లోని పునబాక ప్రాథమి కోన్నత పాఠశాలలో సోమవారం 'నా భూమి నా దేశం' కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భం గా ఎంఈఓ శంకరయ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీ యులని స్మరించుకుంటూ, రక్షణ కోసం అసువులు బాసిన సైనిక వీరులను స్మరించుకుంటూ విద్యార్థుల్లో దేశభక్తిని రేకెత్తించే మహత్తరమైన కార్యక్రమమే 'నా భూమి- నా దేశం' అని ఉద్బోధించారు. అనంతరం విద్యార్థులు సేకరించిన మట్టితో నింపిన కలశాన్ని, దేశభక్తుల చిత్రపటాలను, పట్టుకొని ఊరేగించారు. ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఏ శ్రీనివాసులు, కమిటీ చైర్మన్ యోగేశ్వరయ్య, అనసూయమ్మ , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.










