Feb 04,2023 00:18

విద్యాలయాలను సందర్శించిన ఎంపిపి కారం లక్ష్మి

ప్రజాశక్తి -విఆర్‌.పురం
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఎంపిపి కారం లక్ష్మి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను శుక్రవారం ఎంపీపీ, సిపిఎం నాయకులు సందర్శించారు. పాఠశాలలో నైట్‌ వాచ్‌మెన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, అటెండర్‌ లేరని హెచ్‌ఎం వెంకట్రావు ఎంపీపీ కారం లక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపిపి లక్ష్మి మాట్లడుతూ మాట్లాడుతూ టెన్త్‌ వార్షిక పరీక్షలు దగ్గర్లో ఉన్నాయని, పిల్లల మంచిగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలంటే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మండలంలోని వడ్డీ గూడెం స్కూల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి చిన్నబాబు, నాయకులు పంకు సత్తిబాబు, గూటాల శ్రీనివాసరావు, తుర్రం బాబూరావు పాల్గొన్నారు.