ప్రజాశక్తి-పాయకరావుపేట:పట్టణంలోని కనోస ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ప్రిన్సిపాల్ సిస్టర్ సోఫియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, క్రీస్తు పుట్టుక సర్వ మానవాళికి సంతోషకరమన్నారు. సంఘంలో మహిళలు, విద్యార్థులు ఆదర్శవంతమైన జీవితాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకమైన కీర్తనలు అలపించారు. అనంతరం క్రిస్మస్ కేకు కట్ చేసి బహుమతులను విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, మేరీ, అలెక్స, పిటి శ్రీను పాల్గొన్నారు.
గొలుగొండ:మండలంలోని ఏఎల్ పురం మేజర్ పంచాయతీ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ లోచల సుజాత జ్యోతి ప్రజ్వలన చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సెయింట్ ఆన్స్ పాఠశాలలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెయింట్‌ఆన్స్ స్కూల్ డైరెక్టర్ పాల్‌అమల్, కరస్పాండెంట్ జాన్ సుశియా మాణిక్యం, ప్రిన్సిపల్ సైమన్ పాల్గొన్నారు.










