సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈఓ
ప్రజాశక్తి-నక్కపల్లి:పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని కొత్త మెనూ ప్రకారం అందించాలని ఎంఈఓ డివిడి ప్రసాద్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుండి కొత్త మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలన్నారు. తప్పనిసరిగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కొత్త మెనూ అమలు చేయకపోతే చర్యలు తప్పదని హెచ్చరించారు.










