ప్రజాశక్తి - భట్టిప్రోలు
ప్రభుత్వం విడుదల చేసిన క్రీడా పరికరాలను స్థానిక విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ దేవరాజు ఆధ్వర్యంలో ఎంపీపీ జడ్పీటీసీల చేతుల మీదుగా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బీవీ లలిత కుమారి మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఉల్లాసానికి ప్రతి పాఠశాలలో క్రీడలు అలవర్చుకోవాలనే ఉద్దేశంతో క్రీడా పరికరాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో 17రకాల క్రీడా సామాగ్రి మంజూరు చేశారు. వీటిని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి టి ఉదయభాస్కరి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ ఉన్నారు.










