Aug 23,2023 22:37

ఎంఇఒకు వినతిని అందజేస్తున్న పారిశుధ్య కార్మికులు

పాలకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద బుధవారం ఎపి ప్రభుత్వ పాఠశాల కళాశాల శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, ఎపి పాఠశాల కళాశాల శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ మండల కమిటీ గౌరవ అధ్యక్షులు కాద రాము, అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పి.జ్యోతి మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని, ప్రతినెలా 5న వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏడాదికి రెండు జతల యూనిఫామ్‌ ఇవ్వాలని, అందర్నీ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించా లని తదితర సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కె.రజిని, బి.గౌరీ, పి.గౌరి, డి.నరసమ్మ, టి.ధనలక్ష్మి, డి.కుమారి తదితరులు పాల్గొన్నారు.