Oct 28,2023 22:10

వంటపాత్రలను అందజేస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-యర్రగొండపాలెం
యర్రగొండపాలెం మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలో గల మొయిన్‌ ప్రభుత్వ పాఠశాలకు శనివారం సర్పంచ్‌ కర్నాటి వెంకటేశ్వరరెడ్డి వంటపాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని తెలిపారు. విద్యార్ధులకు జగనన్న గోరుముద్ద వండి పెట్టేందుకు అవసరమైన వంట పాత్రలను ప్రభుత్వమే మంజూరు చేయడం శుభ పరిణామమన్నారు. ఈ పాత్రలను శుభ్రంగా ఉంచుకొని విద్యార్ధులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ చైర్మన్‌ అడిపి చిన్న గాలెయ్య, ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, మాలకొండా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.