Oct 27,2023 00:20

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
మండలంలోని వలపర్ల జడ్పీ హై స్కూల్‌లో 10వ తరగతి ఉత్తీర్ణులైన 14 మంది 2022-23బ్యాచ్‌కి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మన్నం నిర్మల రూబెన్, ఉపాధ్యాయుల కృషితో ట్రిపుల్ ఐటిలో అత్యధిక సీట్లు సాధించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తమ పాఠశాలకు గుర్తింపు తెచ్చారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన ట్రిపిల్ ఐటీలో సీట్లు సాధించిన 14మంది విద్యార్థులు తాము చదివిన పాఠశాలకు విలువైన కంప్యూటర్‌తో పాటు 50కుర్చీలను పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థులను హెచ్ఎం అభినందించారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించిన పాలపర్తి పల్లవికి రాజమండ్రి వికాస్ ట్రస్ట్ ప్రతినిధులు ఇంటర్ టెక్ట్స్‌ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ టి ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.