ప్రజాశక్తి-అద్దంకి: రోటరీ క్లబ్ అఫ్ సింగరకొండ, అద్దంకి ఆధ్వర్యంలో శంఖవరప్పాడు జడ్పీ ఉన్నత పాఠశాల గ్రంథాలయానికి ఉపయోగపడే రూ.12 వేల విలువైన పుస్తకాలను దాతలు బహూకరించారు. ఈ కార్యక్రమం జాగర్లమూడి శివకుమారి సౌజన్యంతో జరిగినది. రోటరీ ప్రెసిడెంట్ సందిరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సెక్రటరీ చిన్ని మురళీకృష్ణ, కోశాధికారి తమ్మన శ్రీనివాసరావు, రోటరీ సభ్యులు జాగర్లమూడి శివకుమారి, నర్రా శ్రీలక్ష్మి, కొల్లా భువనేశ్వరి, చప్పిడి వీరయ్య, తాళ్లూరి బాబురావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, స్కూల్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్కూలుకు అందించిన పుస్తకాలతో విద్యార్థులు బాగా చదువుకొని తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు. చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో.. అని కందుకూరి వీరేశలింగం పంతులు, పుస్తకానికి మించిన భూషణం ఏది లేదని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తు చేశారు. ప్రతివారు లైబ్రరీని ఉపయోగించుకోవాలని చెప్పారు. అనంతరం దాత శివకుమారిని ఘనంగా సత్కరించారు.










