Sep 23,2023 20:11

ప్రజాశక్తి - పోడూరు
గుమ్మలూరు శ్రీపూసపాటి కుమారస్వామి రాజా జిల్లా పరిషత్‌ ఓరియంటల్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు రెండు కంప్యూటర్లను శనివారం పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం కుక్కల బేబీ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ పాఠశాలలో 1977-78 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నత వ్యాపారవేత్తలుగా ఉన్న పూర్వ విద్యార్థులు నడింపల్లి వెంకట సూర్యనారాయణ రాజు, రుద్రరాజు రామలింగరాజు, పెనుమత్స బోసురాజు పాఠశాలకు కంప్యూటర్లు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను పాఠశాల సిబ్బంది అభినందించారు.