జంగారెడ్డిగూడెం: తాడువాయి అరుంధతి పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు దాతల సహకారంతో బీరువా సమకూరిందని ప్రధానోపాధ్యాయుడు ఆర్.నాగ దుర్గారావు తెలిపారు. బుధవారం తాడువాయి గ్రామానికి చెందిన పాపోలు సుబ్బారావు జ్ఞాపకార్థం భార్య ఈశ్వరమ్మ, కుమారుడు కోడలు రామ్మోహన్ రావు, శ్రావణి, కుమారుడు రామాంజనేయులు పాఠశాలకు బీరువా బహూకరించారు. హెచ్‌ఎం రామ్మోహన్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.










