Feb 22,2023 00:38
సాయం అందజేసిన రావూరి శివరామ ప్రసాద్‌కు అభినందనలు తెలుపుతున్న దృశ్యం

ప్రజాశక్తి-పంగులూరు: మండలంలోని చందలూరు గ్రామంలోని, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్‌ ఆధునీకరణ పనులకు రూ.60 వేలను అందజేసిన, పాఠశాల పూర్వ విద్యార్థి రావూరి శివరామ ప్రసాద్‌కు అభినందన సభ మంగళ వారం పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానో పాధ్యాయులు గుమ్మా శ్రీనివాసరావు మాట్లాడు తూ, పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ను ఆధునీకరిం చడం వలన, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగు నీరును అందించే అవకాశం ఏర్పడిందని పేర్కొ న్నారు. పాఠశాల ఆర్వో ప్లాంట్‌ ఆధునీకరణ పనులకు రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించిన శివరామ ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయు లు తాతయ్య మాస్టారుకు, ఆధునీకరణ పనులను దగ్గర ఉండి పూర్తి చేయించిన, పాఠశాల ప్రధాన దాత వారసుడు అడ్డగడ సుబ్బయ్యకు, ఈ పనిని మొత్తం సమన్వయం చేసిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుకు, ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రావూరి ఉమామహేశ్వరరావు, చిట్టాబత్తిన శేషారావు పాల్గొన్నారు. అనంతరం శివరాం ప్రసాద్‌, ఆయన తండ్రి ఉమామహేశ్వరరావును పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది సన్మానించారు.